11, నవంబర్ 2026, బుధవారం
Daily
బైబిల్ లో వాట్సాప్ గురించి ఉంది. మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది. సామెతలు 27 14 వ వచనం చూస్తే, పొరుగు వాళ్ళను పొద్దునే శుభోదయం అని గట్టిగా పిలుస్తూ నిద్ర లేపటం ఆశీర్వాదం కాదు గాని శాపము అని దేవుని వాక్యం చెపుతోంది. ఈ రోజులో మనం నిద్రలేచేది సెల్ ఫోన్ పెట్టుకున్న అలారం తోనే. నిద్ర లేవగానే అందరు ముందుగా చూసేది ఫోన్ మాత్రమే. అంతలాగ ఫోన్ మనకు అలవాటు అయిపొయింది, అలాగే ఉపయోగం అయిపొయింది. అలాంటి ఫోన్ లో కొంతమంది, పొద్దున్నే అడ్డమయిన మెస్సేజ్ లతో జనాలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లు చేసేది ఏమి ఉండదు, శుభోదయం, గుడ్ మార్నింగ్ అనే ఎవరో వారికి పంపిన వాటిని ఫార్వర్డ్ చేస్తుంటారు. ఏదయినా ముఖ్యమయిన మెసేజ్ వచ్చిందేమో అని ఆత్రంగా చూసే వాళ్ళకు వీళ్ళు శాపంగా తయారవుతారు. మన నుండి మెసేజ్ ఏదయినా వచ్చిందంటే, వాళ్లు సంతోషపడి పోవాలి గాని పొద్దునే మొదలు పెట్టాడు బాబు, అని చిరాకు పడకూడదు. దేవుని ప్రేమ చొప్పున మీకు నచ్చిన వాగ్దానాలు ఏవయినా అప్పుడప్పుడు వారు కాస్త ఖాళీగా ఉండే సమయాల్లో పంపించండి. ధైర్యం తెచ్చుకుంటారు, ఆలోచిస్తారు. కానీ అనవసరయినా మెసేజ్ లతో వాళ్ళు మిమల్ని తిట్టుకొనేలా చేసుకోకండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)