చీకటికి ఒక రూపం లేదు
వెలుగు అరిపోవటం తప్ప
భయం బ్రతికేది
ధైర్యం లేదన్న ధైర్యం తో కదా?
సూర్యుడస్తమించకా!
సూర్యోధయం రాదా?
నిన్నగా మారె తెగింపులో
సగం ఉన్న చాలు
రేపు అనే దీపానికి
ఊపిరుధగలవు
సానకు వెరవని వజ్రం
కొలిమిని దాటినా కనకం
విలువకు అంతుందా?
శ్రమ తెలిసిన వాడికి
పలితంతో పనేముంది
అనుభవం గడించే వాడికి
తెలివికి కొదువె ముంది
శ్రమతో చెమట చిందితే
నుదుటి రాత చెదరదా?
ఉన్నత లక్ష్యం నీదైతె
అపజయం అదిరి పడదా?
విజయం నిన్ను చేరదా!
వెలుగు అరిపోవటం తప్ప
భయం బ్రతికేది
ధైర్యం లేదన్న ధైర్యం తో కదా?
సూర్యుడస్తమించకా!
సూర్యోధయం రాదా?
నిన్నగా మారె తెగింపులో
సగం ఉన్న చాలు
రేపు అనే దీపానికి
ఊపిరుధగలవు
సానకు వెరవని వజ్రం
కొలిమిని దాటినా కనకం
విలువకు అంతుందా?
శ్రమ తెలిసిన వాడికి
పలితంతో పనేముంది
అనుభవం గడించే వాడికి
తెలివికి కొదువె ముంది
శ్రమతో చెమట చిందితే
నుదుటి రాత చెదరదా?
ఉన్నత లక్ష్యం నీదైతె
అపజయం అదిరి పడదా?
విజయం నిన్ను చేరదా!