19, మార్చి 2014, బుధవారం

నాకో నిజం తెలిసింది !!! -2


నాకో నిజం తెలిసింది
అందం అనందం లో
అనందం తృప్తి లో
తృప్తి  ఆపేక్షను అణుచుటలో ఉందని

నాకో నిజం తెలిసింది
భాద్యత బరువునే  కాదు
అనుభవన్ని ఇస్తుందని
అనుభవం తెలివిని పెంచుతుందని

నాకో నిజం తెలిసింది
అతి విమర్శ ఇష్టాన్ని  చంపుతుందని
అతి పొగడ్త బద్దకాన్ని పెంచుతుందని
అతి వినయం గౌరవణ్ణి తగ్గిస్తుందని


నాకో నిజం తెలిసింది
డబ్బుతో కూలీలను కొనగలం కాని
మేలు కోరే మనుష్యులను కాదని

నాకో నిజం తెలిసింది
మన  వారికి  వివరణ అవసరం లేదని
పరాయి వారికి అది అనవసరం అని

నాకో నిజం తెలిసింది
ఆయుధం మనిషిని లొంగదిస్తుందని
మాట మనసును సైతం లొంగదిస్తుందని

నాకో నిజం తెలిసింది
మన భవిష్యత్తును మన గతం కాక
మన వర్తమానం నిర్ణయించాలని

 నాకో నిజం తెలిసింది
మన విజయాలు ఇతరులకు చెప్పటం
గొప్ప కోసం కాకుండా వారిని
ఉత్తేజ పరిచేలా ఉండాలని

నాకో నిజం తెలిసింది
ఆవేశ పడటం అందరికి సాధ్యం అని
ఓపికగా ఉండటం కొందరికే సాధ్యం అని
అది అంత తేలిక కాదని

నాకో నిజం తెలిసింది
తెలివయిన వారి కింద పనిచేసే కన్న
మూర్ఖుల కింద పని చేస్తే
గుణపాఠాలు ఎక్కువ నేర్చుకోగలమని 

నాకో నిజం తెలిసింది
విజయానికి కొలమానం
ఎంత సాధించమని కాదని
ఎన్ని అడ్డంకులలో సాధించమని

నాకో నిజం తెలిసింది
విజయం కోసం ప్రయత్నం
సాధ్యసధ్యల  మిద సాగాలని
లేదంటే అది వృదా ప్రయాసేనని

నాకో నిజం తెలిసింది
నిలకడ లేని మనసు
నిశ్చయం లేని మనిషి
ఆశలేని జీవితం
ధైర్యం లేని ప్రాణం
ఎందుకు పనికి రావని